15 August, 2026 | 3:52 PM

మోడల్ స్కూల్లో ఆలరించిన విద్యార్థుల యోగాసనాలు

15-08-2026 03:03 PM

బోథ్. ఆగస్టు 15 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రిన్సిపాల్ అనురాధ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఏర్పడిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ యోగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల లో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.