15 August, 2026 | 4:06 PM

చెన్నూర్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 03:16 PM

చెన్నూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శని వారం ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిఫ్ కోర్టులో జడ్జి పర్వతపు రవి, పోలీస్ స్టేషన్ లో సీఐ బన్సీలాల్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో  చైర్మన్ మహేష్ ప్రసాద్ తివారీ, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మోహన్ లు జాతీయజెండా ను ఆవిష్కరించాగా, క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్ మంత్రి లక్ష్మణ్, అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తగరం వెంకటి, జ్యోతి బాపురావ్ పూలే విగ్రహం వద్ద బీజేపీ చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జ్ దుర్గం అశోక్, ఆర్యవైశ్య సంఘ భవనంలో సంఘ మండల అధ్యక్షుడు చిలువేరు మల్లిక్, సిపిఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి నేన్నెల సమ్మయ్య, ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ జెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.