ఉన్నతాధికాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తా
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో పంటలు కాలిపోయి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ జీ నగేష్ పేర్కొన్నారు. గురువారం గ్రామంలో కాలిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని తాను రైతుల ఆర్థిక స్థితిగతులను జిల్లా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు వివరించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. చేతికి అందిన పంట కళ్ళముందే కాలిపోతే రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అన్నారు.
నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేంత వరకు తాను కృషి చేస్తానన్నారు. అక్కడి నుండే ఉన్నతాధికారులకు మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక అగ్నిమాపణ కేంద్రాన్ని మండలానికి కేటాయించడంతో ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు .ఆయన వెంటమండల పార్టీ కన్వీనర్ బోరే రవీందర్ దక్షిణ మధ్య రైల్వే మాజీ బోర్డు సభ్యులు జీవీ రమణ సహకార సంఘం అధ్యక్షులు కదం ప్రశాంత్ మాజీ సర్పంచ్ ఆకుల రాజేందర్ రాజేశ్వర్ రెడ్డి రాజేశ్వర్ తో పాటు పలు గ్రామాల నాయకులు ఎంపీ వెంట ఉన్నారు






