బడిబాట తర్వాతే సర్దుబాటు చేయాలి
07-06-2025 06:16 PM
పెద్దకొత్తపల్లి: బడిబాట తర్వాతనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని టీఎస్ యుటిఎఫ్(TS UTF) పెద్దకొత్తపల్లి మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌస్ పాషా, మల్లయ్యలు శనివారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే లక్ష్యంగా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 19 వరకు చేపడుతోంది. కానీ ఇదే సమయంలో ఈనెల 13 లోపే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కూడా చేపట్టడం వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందన్నారు.






