calender_icon.png 8 June, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బక్రీద్ వేడుకలు..

07-06-2025 06:18:38 PM

చండూరు (విజయక్రాంతి): చండూరు మున్సిపల్ పట్టణంలో శనివారం బక్రీదు పండుగ(Eid al-Adha) సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం మత గురువు ముజాహిద్ మాట్లాడుతూ... విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ పండుగ అని, ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ త్యాగ నిరతికి, ధర్మ నిబద్ధతకి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.

అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బక్రీద్ పండుగ జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కోడి గిరిబాబు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్రుద్దీన్, కరెంట్ షరీఫ్, ఏజాస్, జావేద్, నిరంజన్ అలీ, సాదక్, షజ్జు పాష, ఖలీల్, ముజ్జు, జిన్నా, లతీఫ్, రహీం బాబా, హైమద్, జమీల్, వహీద్, అజీమ్, బెల్లంకొండ శేఖర్, మాస కృష్ణ, విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.