18 July, 2026 | 11:44 AM

అద్వానీకి అస్వస్థత

15-12-2024 01:07 AM

అపోలో ఆస్పత్రిలో చేరిక

నిలకడగా ఆరోగ్యం

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: మాజీ ఉప ప్రధా ని, బీజేపీ అగ్రనేత లాల్‌క్రిష్ణ అద్వానీ(97) అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స కోసం ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్ లో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అద్వానీ వృద్ధా ప్య సమస్యలతో బాధపడుతుండటంతో సాధారణ పరీక్షల నిమిత్తం రెండు రోజుల క్రితం ఆయనను అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. 

డాక్టర్లు ఆయనకు వివిధ రకాల పరీక్షలు చేశా రు. న్యూరాలజీ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యం లో అద్వానీ చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఏడాది జూలైలో వృద్ధాప్య సమస్యల కారణం గా అపోలో ఆస్పత్రిలో, అంతకుముందు ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు.