18 July, 2026 | 12:04 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యా

15-12-2024 01:11 AM

ఆప్ అధినేత కేజ్రీవాల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: 2020 ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన మూడు ప్రధాన హామీలను నెరవేర్చడంలో తాను విఫలం అయ్యాయని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. ఢిల్లీలో 2025లో అసెంబ్లీ ఎన్నికలు  జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ  ప్రధా న హామీలైన యుమునా నదిని శుభ్రపరచ డం, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీటిని అందించడం, ఢిల్లీ రోడ్లను యూరోపియన్ ప్రమాణాలకు మార్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

మొద టి రెండున్నర ఏండ్లు కోవిడ్, ఆ తరువాత ఆప్ మంత్రులు జైలుపాలు కావడంతో తాను ఈ మూడు హామీ లు నెరవేర్చలేకపోయానని పేర్కొన్నారు.  తనను, ఆప్‌ను మరోసారి ఎన్నుకోవాలని ఢిల్లీ ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.  అయి తే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.