రేపు లోక్‌సభకు జమిలీ బిల్లు
ప్రవేశపెట్టనున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి
ఒకే దేశం ఎన్నికపై ముందడుగు
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఒకే దేశం ఎన్నికకు సంబంధించిన రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కేంద్రం రెడీ అవుతోంది. దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే జమిలీ ఎన్నిక లకు సంబంధించిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల 16న లోక్‌సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
129వ రాజ్యాంగ సవరణ బిల్లును, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. జమిలీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో అధికార బీజీపీ ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే కీలక ప్రణాళికను అమలుచేసే దిశగా ముందడుగు వేసింది.
మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవర ణ బిల్లుతో అనుసంధానం చేసేందుకు చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో సహా మరో రెండు ముసాయిదా చట్టాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఎజెండాలో ఈ బిల్లులు లేకపోయినా మోదీ, అమిత్ షా సహకారంతో అవి ఆమోదం పొందాయి.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసిం ది. ఇందుకోసం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది. స్థానిక ఎన్నికలను కూడా వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతోపాటు 50 శాతం రాష్ట్రాల ఆమోదం పొంద డం తప్పనిసరి కావడంతో ఈ విషయాన్ని కేంద్ర పక్కన పెట్టింది.
మరోవైపు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల బిల్లులకు 50 రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని అనధికార వర్గా లు తెలిపాయి. దీంతో దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండోంతుల మద్ద తు అవసరం. మొత్తం 542 మంది ఎంపీలు లోక్‌సభలో ఉన్నారు. ఎన్డీయేకు 293 మం ది ఎంపీలు , ఇండియా కూటమికి 235 మంది ఎంపీలు ఉన్నారు. బిల్లు ఆమోదానికి 361 మంది సభ్యుల మద్దతు అవసరం.






