23 May, 2026 | 1:33 PM

మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాది హత్య

23-05-2026 12:45 PM

మాసబ్ ట్యాంక్‌: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ హత్య జరిగింది. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ(Protection of Waqf Board Lands) కోసం పోరాడుతున్న న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌(Advocate Khaja Moinuddin) ఇంటి నుంచి బయటకు రాగానే కారుతో ఢీ కొట్టిన దుండగులు అక్కడినుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

శనివారం ఉదయం తన కారు ఎక్కుతుండగా దుండగులు మరో కారులో వచ్చి ఢీకొట్టారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీడియో క్లిప్‌లో, ఒక SUV అత్యంత వేగంతో దూసుకొచ్చి మొయిజుద్దీన్‌ను ఢీకొట్టింది. ఆ ధాటికి అతను గాలిలోకి ఎగిరి, కొన్ని మీటర్ల దూరంలో రోడ్డుపై పడిపోయాడు. అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.