కోమటిచెరువులో పడి యువకుడి మృతి
27-07-2026 05:06 PM
సిద్దిపేట క్రైం, జూలై 27 : సిద్దిపేట పట్టణంలోని నాసర్ పురా ప్రాంతానికి చెందిన మిద్దె చందు అనే యువకుడు ఆదివారం రాత్రి స్థానిక కోమటి చెరువులో పడి చనిపోయాడు. పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని సోమవారం బయటకు తీయించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.






