27 July, 2026 | 5:44 PM

కొత్తపల్లి రైతు వేదికలో విత్తన మేళా

27-07-2026 05:13 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రైతులు ఎలినినో ప్రభావం వలన ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని, భూగర్భ జలాలు కూడా తగ్గుతున్న బోరు బావుల కింద కూడా వరి పంట సాగు తగ్గించుకొని, ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు కందులు, నువ్వులు, మక్కా మరియు వేరుశెనగ విత్తనాలు రైతు వేదిక కొత్తపల్లి లో అందుబాటులో ఈ నెల 27 తేదీ నుండి 29 వరకు ఉంటాయని కొత్తపల్లి వ్యవసాయ అధికారి కోట సంతోష్ కుమార్ తెలిపారు. ఈ విత్తన మేళలో వ్యవసాయ పరిశోధన కేంద్రం, కరీంనగర్ వారు విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. కందులు మక్కలు, మినుములు మరియు వేరుశనగల విత్తనాలు రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఎఆర్ఎస్ ఎఓ పద్మ, టిఆర్వికే కోఆర్డినేటర్ మధుకర్ రావు, కొత్తపెళ్లి మండల ఏఈఓలు, ఫజిల్, ఫరీద్, రాజశేఖర్, డీలర్లు మరియు  రైతులు పాల్గొన్నారు.