26 April, 2026 | 1:53 AM

రైతుబంధు కాజేసిన ఏఈఓ సస్పెన్షన్!

26-04-2026 12:29 AM

రాజకీయ ఒత్తిడి పక్కన పెట్టి శాఖపరమైన చర్యలకు ప్రాధాన్యం

నాగర్ కర్నూల్, ఏప్రిల్ 25(విజయక్రాం తి): మరణించిన రైతు కుటుంబానికి చెందాల్సిన రైతుబంధు నిధులను తన సొంత తల్లి అకౌంట్‌కు మళ్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన గ్రామీణ వ్యవసాయ శాఖ అధికారి పాలెం క్లస్టర్ (ఏఈ ఓ) ఎన్.షాగాది విష్ణువర్ధన్‌ని సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ‘రైతుబంధు కాజేసిన రాబందు.!’ అనే శీర్షికతో శనివారం విజయక్రాంతి పత్రికలో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పం దించారు.

రాజకీ య ఒత్తిళ్లను పక్కనపెట్టి పారదర్శకతకు ప్రాధాన్యతని స్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమగ్ర విచా రణ నివేదిక ఆధారంగా విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు లబ్ధిదారుడి రైతుబంధు నిధులు అక్రమంగా స్వాహా చేసిన డబ్బులు 1,94,525 రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారికి శాఖ పరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.