ఎన్నా ళ్ల కెన్నా ళ్లకు..
- జపాన్ ఓపెన్ విజేత పీవీ సింధు
- నాలుగేళ్ల తర్వాత తొలి టైటిల్
- చరిత్ర సృష్టించిన తెలుగుతేజం
- ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్
టోక్యో, జూలై 19 : నాలుగేళ్ల సుధీర్ఘ నిరీక్షణకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెర దించింది. మేజర్ టైటిల్ విజయం కోసం ఎదురుచూస్తున్న తెలుగుతేజం ఎట్టకేలకు ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకుంది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ 750 టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది. ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానే యమగుచిని ఓడించి పీవీ సింధు తొలిసారిగా జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.
టైటిల్ పోరులో మొదటి గేమ్‌లో సిం ధు యమగుచి కంటే వెనుకబడింది. కానీ తర్వాత అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌పై పట్టుబిగించింది. వరుస గేమ్స్‌లో 21- 21 తేడాతో విజయం సాధించింది. 2024లో స్వదేశంలో సయ్యద్ మోడీ అంతర్జాతీయ టైటిల్ గెలిచిన తర్వాత సింధు చాలా టోర్నీలు ఓడిపోయింది.
పలు సూప ర్ సిరీస్‌లలో సెమీస్ లేదా క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టింది. చెప్పాలంటే 2019 లో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన ఏడేళ్ల తర్వాత పీవీ సింధుకు ఇది మొదటి ప్రధాన టైటిల్ విజయం. 31 ఏళ్ల సింధు కెరీర్‌లో ఇది మొదటి సూపర్ 750 సిరీస్ టై టిల్. ఇటీవల కాలంలో గత 10 మ్యాచ్లలో ఏడింటిలో గెలిచి యమగుచి పైచేయి సా ధించినప్పటికీ సింధు తన కెరీర్లో తొలిసారిగా జపాన్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం ద్వారా యమగుచిపై తన ఆధిక్యాన్ని 16 పెం చుకుంది.
కాగా ఈ విజయం సింధు కెరీర్‌కు చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే గత రెండేళ్లుగా వరుస గాయాలు, పేలవ ఫామ్ తో వెనుకబడిపోయింది. ఒకదశలో సైనా తరహాలోనే ఆటకు దూరమవుతుందేమన్న ఆందోళన కూడా నెలకొంది. అయితే నిరుత్సాహపడకుండా గాయాల నుంచి కోలకు ని, ఫిట్‌నెస్ సాధించిన సింధు ఇప్పుడు అదరగొట్టింది. జపాన్ ఓపెన్ విజయం ప్రతి ష్టాత్మక ఆసియాక్రీడలకు ముందు సింధుకు మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వచ్చే ఒలింపిక్స్‌లోనూ ఖచ్చితంగా మెడల్ గెలుస్తానని కాన్ఫిడెంట్‌గా ఉన్న సింధుకు ఇకపై ప్రతీ టోర్నీ కీలకమే.
సింధుకు పలువురు ప్రముఖుల అభినందనలు
ఇదిలా ఉంటే సింధు జపాన్ ఓపెన్ గెలవడంపై పలువురు ప్రముఖులు అభినంద నలు తెలిపారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మాండవీయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఆమెకు అభినందనలు చెబుతూ ట్వీట్లు చేశారు.






