21 July, 2026 | 7:38 AM

కోనరావుపేటలో టీఎస్‌యూటీఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభం

20-07-2026 05:53 PM

సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎంకు వినతి

కోనరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోనరావుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, ఎంఆర్సీలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు సోమవారం పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండమనేని మహేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు మాట్లాడుతూ... కేజీబీవీ, యూఆర్‌ఎస్, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవు సౌకర్యాలు కల్పించాలని, వార్షిక ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కేర్‌టేకర్లను నియమించాలని, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డులు పంపుతున్నట్లు పేర్కొన్నారు.