టీఎస్‌యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం
వాంకిడి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. వాంకిడి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి పేరుతో పోస్టుకార్డులు రాసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతతో పాటు న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు మద్దతు తెలుపుతున్నట్లు టీఎస్‌యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గయ్య, మండల అధ్యక్షుడు హరీష్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సాయికుమార్, ఉపాధ్యక్షుడు రాజలింగు, కేజీబీవీ ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.






