4 March, 2026 | 10:33 AM

చంద్రగ్రహణం మోక్షం అనంతరం సంప్రోక్షణ.. భక్తులకు తిరిగి దర్శనం

04-03-2026 12:00 AM

రాజన్నాలయ ఈఓ : రమాదేవి

వేములవాడ, మార్చి 3,(విజయక్రాంతి)చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6:00 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం, అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలను మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రమా దేవి తెలిపారు.గ్రహణ మోక్షకాలం అనంతరం రాత్రి 7:30 గంటల తర్వాత ఆలయా ల్లో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.

అనంతరం ప్రాతఃకాల పూజలు నిర్వ హించి, భక్తులకు దర్శనం యథావిధిగా ప్రా రంభించినట్లు ఆమె వెల్లడించారు.గ్రహణ కాలంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ ద్వారాలు మూసివేయడం, గ్రహ ణం విడిచిన తరువాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ ఈఓ తెలిపారు.