13 April, 2026 | 9:54 PM

రాజకీయాల్లో చురుకుదనం అవసరం: పసుమర్తి

13-04-2026 08:38 PM

కల్లూరు,(విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని కర్మాన్ఘాట్‌లోని లక్ష్మీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అత్యవసర సమావేశంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, కల్లూరు నివాసి పసుమర్తి చందర్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా ముందుకు వచ్చి ప్రజా వ్యవహారాల్లో చురుకైన పాత్ర వహించాలని పిలుపునిచ్చారు.

సమాజ అభివృద్ధి కోసం రాజకీయాల్లో ప్రాతినిధ్యం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.అలాగే, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ఆర్యవైశ్య విద్యార్థులు విద్య, ఆరోగ్య రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మహాసభ అండగా నిలవాలని ఆకాంక్షించారు.గత రెండు సంవత్సరాల కాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా వివరించారు.ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు ప్రముఖ ఆర్యవైశ్యులు పాల్గొని సమాజ అభివృద్ధి దిశగా పలు అంశాలపై చర్చించారు.