26 July, 2026 | 11:43 AM

సంతానలేమికి ఆధునిక చికిత్స

26-07-2026 10:38 AM

- ఎల్బీనగర్ లోని ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ లో ప్రత్యేక కార్యక్రమం 

ఎల్బీనగర్: సంతాన సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి నిపుణులను సంప్రదించడం ఎంతో ముఖ్యమని ఎల్బినగర్ లోని మనోజ్ఞ ఫెర్టీ9 వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ శృతి మంత్రీ అన్నారు. మారుతున్న జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి, ఆలస్య వివాహాలు వంటి కారణాల వల్ల ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నప్పటికీ, ఆధునిక వైద్య సాంకేతికత, సరైన సమయంలో చికిత్స ప్రారంభించడం ద్వారా విజయవంతమైన గర్భధారణ అవకాశాలను గణనీయంగా పెంచవచ్చునని తెలిపారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫెర్టీ9 ఎల్బీనగర్ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని  11 ఫెర్టీ9 కేంద్రాల్లో నీడిల్-ఫ్రీ ఐవిఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. దీని ద్వారా రోజువారీ ఇంజెక్షన్ల వల్ల కలిగే నొప్పి, ఆందోళనను తగ్గించవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్‌వర్క్‌గా పేరుగాంచిన ఫెర్టీ9కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఫెర్టీ9 క్లినికల్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు.

భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇది 1.8, ఆంధ్రప్రదేశ్‌లో 1.7కు చేరిందని ఫెర్టీ9 వైద్యులు పేర్కొన్నారు.   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 11 ఫెర్టిలిటీ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోందని వివరించారు.  ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ చికిత్సలతో వేలాది మంది దంపతులకు తల్లిదండ్రులయ్యే ఆనందాన్ని అందిస్తోంది. పరిశోధన, నాణ్యమైన వైద్య సేవలు, రోగి-కేంద్రిత సంరక్షణతో ఫెర్టిలిటీ రంగంలో విశ్వసనీయ సంస్థగా ఫెర్టీ9 కొనసాగుతోందని తెలిపారు.