26 July, 2026 | 11:54 AM

శాఖంబారి దేవిగా కొండపోచమ్మ అమ్మవారు

26-07-2026 10:45 AM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని కొండ పోచమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి ఏటా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. లోక కళ్యాణం కోసం ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని ఆదివారం అమ్మవారు శాఖంబారి దేవిల ఆలయ అర్చకులు అమ్మవారికి పూలు కూరగాయలతో అలంకరణ చేసారు. అనంతరం ఈఓ రవికుమార్ మాట్లాడుతూ... ఆలయ ప్రాంగణంలో వేద పండితులతో గణపతి నవగ్రహ వరుణ పూర్వక చండి హోమం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యలు కలుగకుండా  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలోప్రధాన అర్చకులు రమేష్,సర్పంచ్ సంధ్య శ్రీనివాస్,ఆలయ సిబ్బంది కనుకయ్య,మహేందర్ రెడ్డి,అనిల్, అర్చకులు రమేష్, తిరుపతి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.