26 July, 2026 | 2:23 AM

కాక్రోచ్ కాటు.. ప్రధాన్‌పై వేటు

26-07-2026 01:15 AM

ఇంక్విలాబ్ జిందాబాద్

జెన్ జీ జయధ్వానాలు

మేం గెలిచాం

నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా

  1. లేఖను ఎక్స్‌లో ప్రధాని మోదీకి పంపిన ధర్మేంద్ర ప్రధాన్
  2. యువత ఆశయాలు, భావోద్వేగాలు, ఆకాంక్షలను గౌరవిస్తానని వెల్లడి
  3. రాజీనామా లేఖకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం
  4. విద్యాశాఖ బాధ్యతలు ప్రహ్లాద్ జోషీకి

న్యూఢిల్లీ, జూలై 25: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జన తా పార్టీ (సీజేపీ) నాయకత్వంలో వేలాదిమంది విద్యార్థులు చేపట్టిన భారీ నిరసనల నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇది తనకు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని ప్రధాన్ పేర్కొన్నారు.

సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులు జితేంద్రసింగ్, జేపీ నడ్డాతో మరో విడత చర్చలు జరపడానికి అరగంట ముందే ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసు కున్నట్లు తెలిసింది.

ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాకు గల కారణాలను వివరణాత్మక లేఖలో పేర్కొన్నారు. ‘నేను నాలుగు దశాబ్దాల కుపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితభావంతో పనిచేస్తున్నాను.. బలమైన, సమ్మిళితమైన దూరదృష్టి గల విద్యా వ్యవస్థే ఒక బలమైన దేశానికి పునాది అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను.. దేశ యువత ఆకాంక్షలు, భావాలు, న్యాయమైన అంచనాలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.

దేశంలో యువతరం కలలను నెరవేర్చడం మనందరి రాజకీయ, సామాజిక జీవిత నైతిక సంకల్పం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. 2026 మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు బయటపడ్డాయి.. భారత ప్రభు త్వం వెంటనే దీనిని సుమోటోగా స్వీకరించి, దర్యాప్తును సీబీఐకి నీట్ యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి.

పేద కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన అనేక ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా విజయం సాధించారు. కానీ ఈ సమయంలో కూడా, బాధ్యతాయుతమైన పదవు ల్లో ఉన్నవారు చాలా మంది విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు. ఇది నన్ను చాలా బాధపెట్టింది’ అని ప్రధాన్ తెలిపారు. ‘మన ప్రజాస్వామ్యంపై నాకు ఎల్లప్పుడూ అచంచలమైన నమ్మకం ఉంది.. యువత ఆకాం క్షలు, కలలు, అంచనాలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.

వారు దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, నవ, వికసిత భారత్ నిర్మాతలు.. భవిష్యత్ శిల్పులు కూడా.. గత 10రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూసి నా మన సు బాధించింది.. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విష యం కాదు. యువశక్తే ఈ దేశానికి అసలైన బలం.. యువశక్తిని గందరగోళం అనే కుట్ర లో చిక్కుకోనివ్వం.. ఇదే నా సంకల్పం’ అని అన్నారు. 

మోదీకి కృతజ్ఞతలు..

‘జంతర్ మంతర్ వద్ద, దేశంలో నెలకొన్న ఈ పరిస్థితిని దేశవ్యతిరేక శక్తులు సద్వినియోగం చేసుకోకుండా, దేశ ఐక్యత నిలిచి ఉండేలా, భారత్‌లోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుం డా, మన పిల్లలు చదువుపై సమయాన్ని వెచ్చించి కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో నేను నా రాజీనామా లేఖను గౌరవనీయ ప్రధానమంత్రి మోదీకి పంపాను’ అని ప్రధాన్ చెప్పారు. మోదీ మా ర్గదర్శకత్వం, విశ్వాసం, నిరంతర సహకారానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తె లుపుతున్నాను.

అలాగే, క్యాబినెట్‌లోని సహచరులు, మంత్రిత్వ శాఖల అధికారులు, ఉ ద్యోగులు, నాతో కలిసి పనిచేసే భాగ్యం ల భించిన వారందరికీ నా కృతజ్ఞతలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత. దీనికోసం నేను ఎల్లప్పుడూ అంకితభావంతో ఉంటా.. జగన్నాథస్వామి ఆశీస్సులతో భవిష్యత్‌లో భారత్‌మాత, ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షల నెరవేర్చడానికి నన్ను నేను సాధ్యమైన రీతిలో మలుచుకుంటాను’ అని ప్రధాన్ తన  లేఖలో పేర్కొన్నారు.

నా దీక్ష స్వచ్ఛమైనది: వాంగ్‌చుక్

తాను చేసిన దీక్ష స్వచ్ఛమైందని నిరూపించుకునేందుకు ధృవపత్రం (సర్టిఫికెట్) అవసరం లేదని? అని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. వాంగ్‌చుక్ కేంద్రమంత్రుల సమక్షంలో దీక్ష విరమించిన నేపథ్యంలో డీల్ కుదిరిందంటూ పలువురు విమర్శించడంపై వాంగ్‌చుక్ ఖండిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ఓ వీడియోను సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేశారు. దీక్ష విరమించినప్పటి నుంచి తనకు అనేక మంది ఫోన్ చేశారని, పలు సందేహాలను వ్యక్తం చేశారని అన్నారు.

బేరాలు కుదుర్చుకోవాల్సి వస్తే ఎవరైనా 26 రోజులపాటు తమ ప్రాణాలను ఫణం గా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? అని ప్రశ్నించారు. ఏసీ గదిలో కూర్చొని డీల్ చేసుకోలేనా? అని కౌంటర్ ఇచ్చారు. విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ముఖ్యమైన విషయమేనని, అదే సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే తనకు అ త్యంత ప్రాధాన్యతా అంశమన్నారు. అం దుకే కేంద్రంతో చర్చల సమయంలో రాజీనామా గురించి డిమాండ్ చేయలేదన్నారు.

ప్రజలు, విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నప్పుడు రాజీనామా అంశం తేల్చకుండా కేంద్రం ఎక్కువకాలం నాన్చలేదన్నారు. మంత్రి రాజీనామా చేస్తారని తనకు ముం దే తెలుసన్నారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రి తనకు జైలులా అనిపించిందని, ఖైదీ కంటే తీవ్రంగా పరిగణించారని, బోలెడు ఆంక్ష లు విధించారని, దీంతో కనీసం గది నుం చి బయటికి కూడా రాలేక, ఎవరినీ కలవలేకపోయానన్నారు. తన భార్య గీతాంజలి పిటిషన్‌తో మేదాంత ఆసుపత్రికి తరలించారని అన్నారు.