2 May, 2026 | 12:42 PM

Breaking News

‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORRపై ఘోర రోడ్డుప్రమాదం..మృతులకు కేటీఆర్ నివాళులు   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •   జమ్మూలో వంతెన కూలి ముగ్గురు కూలీలు మృతి, విచారణకు ఆదేశం   •   బెంగాల్‌లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్   •  

వ్యవసాయ శాఖ మంత్రికి భద్రాచలం ఎమ్మెల్యే విజ్ఞప్తి

28-11-2024 07:21 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ఏజెన్సీకి ముఖ్య కూడలి అయిన భద్రాచలం కేంద్రంలో ఆధునిక యంత్రాంగంతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు కోరారు. గురువారం హైదరాబాదులోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. 

భద్రాచలంలో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడమే కాకుండా గిట్టుబాటు ధర వచ్చేదాకా నిల్వ చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుందని అన్నారు. దీనితో రైతులకు మధ్యవర్తుల నుండి విముక్తి పొందుతారని  మంత్రికి తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే ఆదేశించి భద్రాచలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. ఎమ్మెల్యే వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ బుడగం శ్రీను తోటకూర రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు