24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా

02-05-2026 11:31 AM

తూకం లేక రోజులు గడుస్తున్నాయని వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్..

సిద్దిపేట రూరల్, మే 2: సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ చౌరస్తా వద్ద రైతులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. పెద్ద లింగారెడ్డిపల్లి, రాఘవాపూర్, రావురూకుల గ్రామాలకు చెందిన రైతులు తమ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఆరోపిస్తూ, జాప్యం కారణాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి రోడ్డుపై నిల్చొని రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కష్టపడి పండించిన పంటకు సరైన సమయంలో కొనుగోలు జరగాలని, మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బట్టు భాస్కర్ రెడ్డి, బట్టు తిరుపతి, గ్యార పద్మ శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌ బరిగేల నర్సింలు, లింగాల జనార్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.