calender_icon.png 10 February, 2026 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లైన్స్ క్లబ్ లక్ష్యం

10-02-2026 04:38:53 PM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం.. గుండె, షుగర్, బీపీ రోగులకు ఉచిత పరీక్షలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వాతంత్ర సమరయోధులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పాలవరపు రాములమ్మ లక్ష్మీనరసయ్య, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు విశ్రాంత ఉపాధ్యాయుడు ఓరుగంటి సత్యనారాయణల జ్ఞాపకార్థం వారి కుమారులు పాలవరపు సంతోష్, ఓరుగంటి సుభాష్, శ్రీనివాస్ ల సహకారంతో మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలోని విశ్రాంతి ఉపాధ్యాయుల భవనంలో మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.

లైన్స్ క్లబ్ తుంగతుర్తి మండల శాఖ అధ్యక్షులు పాలవరపు సంతోష్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి లైన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ రేపాల మదన్మోహన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో గుండెకు సంబంధించిన వ్యాధులు, షుగర్, బీపీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిక్ వంటి దీర్ఘకాలిక రోగాల పై ప్రత్యేకంగా సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాదులోని యశోద హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన సూచనలు అందించారు.

ఈ వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ సభ్యులు వెల్లడించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యువ వికాసం కార్యక్రమా నిర్వహించి విద్యార్థులకు పదవ తరగతి పరీక్షల పై దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి గట్టుపల్లి అశోక్ రెడ్డి, రీజియన్ చైర్మన్ కొండ సంతోష్ కుమార్, జోనల్ చైర్మన్ కొండపల్లి లక్ష్మారెడ్డి, లైన్స్ క్లబ్ తుంగతుర్తి మండల ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి,కార్యదర్శి పులుసు వెంకన్న, కోశాధికారి గుండగాని రాము, సంయుక్త కార్యదర్శి ఎనగందుల గిరి, సభ్యులు దుగ్యాల రవీందర్ రావు, కేతిరెడ్డి లతా విజయ కుమార్ రెడ్డి, కేక్ రెడ్డి రవీందర్ రెడ్డి,వంగాల వెంకన్న, డాక్టర్ చారి, గుజ్జ భాస్కర్ తదితర సభ్యులు పాల్గొన్నారు.