12 July, 2026 | 6:06 PM

Breaking News

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •  

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం: ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు రద్దు— ఎప్పటి వరకంటే..?

06-04-2026 10:53 AM

న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా ఎయిరిండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మే 31 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా భద్రతాపరమైన ఆందోళనలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

breaking news కోసం మా హోమ్‌పేజ్ చూడండి”

న్యూఢిల్లీ నుండి టెల్ అవీవ్ మార్గంలో విమాన సర్వీసులను మే 31 వరకు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఈ మార్గంలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. దీంతో కేవలం ఎల్ అల్, ఇస్రాఎయిర్, ఆర్కియా, ఎయిర్ హైఫా వంటి ఇజ్రాయెల్ విమానయాన సంస్థలు మాత్రమే కఠినమైన ఆంక్షల మధ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.