బాసరకు సీఎం రేవంత్.. రూ. 225 కోట్లతో బాసర క్షేత్రానికి నూతన శోభ
06-04-2026 10:37 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ లోని బాసర సరస్వతీ దేవిని దర్శించుకుంటారు. రూ. 225 కోట్లతో మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రికి చేరుకుంటారు. పిప్రిలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం పిప్రిలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు..




