06-02-2026 01:45:16 AM
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 5: యాజమాన్యం మొండి వైఖరినీ నిరసిస్తూ గురు వారం శ్రీరాంపూర్ ఓసీలో నిర్వహించే మైన్స్ కమిటీ సమావేశాన్ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు బహిష్కరించారు. ఈ సందర్భం గా ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ మోతె లచ్చన్న మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసిపిలో గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ సమావేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక కీలక సమస్యలను ప్రస్తావించినప్పటికీ, యాజమాన్యం వాటిలో ఏ ఒక్క సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే, భవిష్యత్తులో మరింత కఠినమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని యాజమాన్యాన్నీ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు.