7 July, 2026 | 2:21 PM

ఆస్పత్రి కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలి...

07-07-2026 01:31 PM

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా...

బాన్సువాడ, జూలై 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి(Government Hospital) ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూ సి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు మాట్లాడుతూ ఆసుపత్రి లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ పేషంట్ కేర్ కార్మికుల కు 26వేల. రూపాయలకు వేతనం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

సంవత్సరానికి కార్మికులకు 23. సెలవులు ఇవ్వాలని, ఒక్క నెల జీతం బోనస్ గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మహిళా కార్మికులకు మెటర్నిటి సెలవులు ఇవ్వాలని ఆయన తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు డిమాండ్లతో కూడీనా విన తి పత్రాన్ని ఏహెచ్ఎంసిహెచ్ హాస్పిటల్ సూపరిండెంట్ విజయ్ భాస్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సురేఖ, సుశీల,జైల్ సింగ్,సంతోష్ గౌడ్, శంకర్, కళ్యాణి, సంగీత, రజియా బేగం,అనసూయ,తదితరులు పాల్గొన్నారు.