7 July, 2026 | 1:56 PM

38 మందికి ఉరిశిక్ష.. గుజరాత్‌ హైకోర్టు సంచలన తీర్పు

07-07-2026 01:22 PM

  1. 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్లు
  2. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
  3. 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు

గుజరాత్: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో(Ahmedabad Serial Blasts) గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పఇచ్చింది. ఈ కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు విధించింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు(Gujarat High Court) సమర్థించింది. 2022లో 38 మందికి మరణశిక్ష, 11 మందికి ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులకు విధించిన శిక్షలను హైకోర్టు సమర్థించింది. 2008 జులై 26న అహ్మదాబాద్ లో 21 చోట్లు సంభవించిన పేలుళ్లలో 56 మంది మృతి చెందారు.

పేలుళ్లలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, తీవ్రంగా గాయపడిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 50,000, స్వల్ప గాయాలైన వారికి ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, దోషులుగా తేలిన 48 మందిలో ఒక్కొక్కరికి రూ. 2.85 లక్షల జరిమానా కూడా విధించింది. మొత్తం 78 మంది నిందితులలో 49 మందిని, హత్య, రాజద్రోహం, ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం వంటి భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని వివిధ నేరాలతో పాటు UAPA మరియు పేలుడు పదార్థాల చట్టం (Explosive Substances Act) కింద కూడా ట్రయల్ కోర్టు 2022 ఫిబ్రవరి 8న దోషులుగా నిర్ధారించింది.