21 July, 2026 | 10:26 PM

Breaking News

అఖిల్ హాస్పిటల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కన్నుమూత

21-07-2026 09:17 PM

 పార్థివదేహానికి ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు నివాళి

 చర్ల, (విజయక్రాంతి): చర్ల మండలం రైసుపేట కాలనీకి చెందిన సీనియర్ కాంట్రాక్టర్, అఖిల్ హాస్పిటల్ చైర్మన్ జవ్వాది ఉమామహేశ్వరరావు (63) అనారోగ్యంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమామహేశ్వరరావు పార్థివదేహానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు మృతుని ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.