పేకాట ఆడుతున్న నలుగురి అరెస్ట్
21-07-2026 09:28 PM
మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరంలో పేకాట ఆడుతున్న నలుగురిని గేమింగ్ యాక్ట్ క్రింద అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం.సాంబమూర్తి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలో దాడులు చేపట్టగా గ్రామానికి చెందిన పల్లె రాజన్న, చకినాల శేఖర్, లెల్ల వెంకటస్వామి, ఎమ్మడిశెట్టి రాజేందర్ లు పేకాట ఆడుతూ కనిపించారని, వారి వద్ద నుండి 2100 రూపాయల నగదు మరియు 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు చట్ట విరుద్ధమైన పేకాట, జూదం మరియు ఇతర గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించి 8712658116 నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ ఐ సాంబమూర్తి విజ్ఞప్తి చేశారు.






