16 June, 2026 | 7:48 PM

నక్కలపల్లి గ్రామంలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం

16-06-2026 07:13 PM

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మంగళరం యాదయ్య, ఉప సర్పంచ్ నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి వారి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మంగళరం యాదయ్య మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చిన్నప్పటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించాలని అన్నారు. గ్రామంలోని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఉప సర్పంచ్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామంలో విద్యాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.