అక్షయపాత్ర 5 బిలియన్ భోజనం
రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా నిర్వహణ
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): అక్షయపాత్ర ఫౌండేషన్ తన 25 ఏళ్ల సేవా ప్రయాణాన్ని పూర్తిచేసుకుంటూ 5 బిలియన్ భోజనాల మైలురాయిని న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో మంగళవారం ్లఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
అక్షయపాత్ర స్థాపకుడు, చైర్మన్ మధు పండిట్ దాస, వైస్ చైర్మన్ చంచల పతిదాస, తెలంగాణ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస సమక్షంలో జరిగింది. వికసిత్ భారత్ కోసం సుపోషిత, సుశిక్షిత భారత్ అనే అంశంతో జరిగిన ఈవేడుకలో ట్రస్టీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజావిధాననిపుణులు, దాత లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజ రయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి విద్యార్థులకు బహుమతులు అందజేసి, భోజనం వడ్డించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, విద్యా లక్ష్యాల పురోగతికి తోడ్పడుతూ 500 కోట్ల భోజనాలను అందించడం అక్షయ పాత్ర ఫౌండేషన్ సాధించిన విశేషమైన విజయంగా నిలిచిందని చెప్పారు. పిల్లలు పాఠశాలకు హాజరవడం ప్రారంభించిన క్షణం నుంచే సాధికారత, సామర్థ్య నిర్మాణ ప్రక్రియ ప్రారంభ మవుతుందన్నారు. 2030 నాటికి ప్రతి పిల్లవాడికి నాణ్యమైన, సమగ్ర విద్యను అందిం చడమే లక్ష్యంగా ఉన్న ‘సమగ్ర శిక్షా అభియాన్’ లక్ష్యాలను సాధించడంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. శ్రీల ప్రభు పాదుల ప్రేరణతో ప్రారంభమైన ఈ సేవాకార్యక్రమం నేడు దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. 16 రాష్ట్రాల్లో 25 వేలకు పైగా పాఠశాలల్లో 23.5 లక్షల మంది పిల్లలకు రోజూ పోషకాహారం అందించడం గొప్ప విషయం అన్నారు.




