టీఆర్పీలో భారీగా చేరికలు
కండువా కప్పి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి జ్యోతి పండల్ సూచన మేరకు.. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుప్పతీ భిక్షపతి ఆమోదంతో, చిన్నకోడూరు మండల అధ్యక్షుడు కోడూరు పోషయ్య ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ అధినేత, ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారు కాలేరు రాము లు, తుమ్మల లింగమూర్తి, ముక్కెర రవి, అల్వాల రాజు, తాటికొండ పోశయ్య, సాయి ల కనకయ్య, ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు పి.నర్సింగ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం వెంకటేష్, చిన్న కోడూరు మండల ప్రధాన కార్యదర్శి గొట్టిపర్తి శ్రీనివాస్, జిల్లా నాయకులు గిరి పాల్గొన్నారు




