18 April, 2026 | 1:16 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

మలయాళ జింఖానా తెలుగులోకి..

19-04-2025 12:00 AM

నజ్లెన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘అలప్పుజ జింఖానా’. ప్రముఖ దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఈ సినిమాను వైబ్స్, ఫైట్స్, ఫన్ బ్లెండ్‌తో తెరకెక్కించారు. ప్లాన్ బీ మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల మలయాళం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు తెలుగులో కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

ఏప్రిల్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి డీవోపీ: జిమ్షి ఖలీద్; సంగీతం: విష్ణు విజయ్; సాహిత్యం: సుహైల్ కోయా; ఎడిటర్: నిషాద్ యూసుఫ్; ఆర్ట్: ఆషిక్ ఎస్; నిర్మాతలు: ఖలీద్ రెహమాన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి; రచన: ఖలీద్ రెహమాన్, శ్రీని శశీంద్రన్; దర్శకత్వం: ఖలీద్ రెహమాన్.