17 July, 2026 | 4:51 PM

ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సు

17-07-2026 04:51 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు అందరూ నీటి వినియోగం తక్కువగా ఉండే అరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి కోట సంతోష్ కుమార్ సూచించారు. కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల, ఖాజీపూర్, సీతారాంపూర్ గ్రామాలలో రైతులకు అరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించారు.

రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా కందులు, పెసలు, మినుములు, నువ్వులు, జొన్న, సజ్జ వంటి అరుతడి పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందాలని ఆయన వివరించారు.ఈ కార్యక్రమాల్లో  గ్రామాల సర్పంచులు లక్కకుల చంద్రకళ- మోహన్‌రావు, కోమటిరెడ్డి అంజని కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు కె. రాజశేఖర్,  ఎం.డి. ఫాజిల్,  ఎం.డి. ఫరీద్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మరియు  రైతులు పాల్గొన్నారు.