17 July, 2026 | 5:12 PM

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

17-07-2026 05:12 PM

తలమడుగు,(విజయక్రాంతి): చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పిల్లలు సోషల్ మీడియాకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువు పట్ల ఆసక్తి చూపాలని, క్రమశిక్షణతో చదివి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థులకు POCSO చట్టం, చైల్డ్ సేఫ్టీ, సేఫ్ టచ్ – అన్‌సేఫ్, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, ఫిర్యాదు చేసే విధానం, చట్టంలోని సెక్షన్ల గురించి, అత్యవసర సహాయ హెల్ప్‌లైన్ నంబర్ల (100,1098) గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, డీహెచ్ఈడబ్ల్యు కోఆర్డినేటర్ కోటేష్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది అశ్విని, రవికాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.