తెలంగాణకు అలర్ట్.. పలుచోట్ల భారీ వర్షాలు

15-09-2026 | 08:41am

తెలంగాణ: తెలంగాణ(Telangana)లో నేడు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.కొన్ని చోట్ల భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు