మంకీ పాక్స్‌పై అప్రమత్తం
20-08-2024 03:17 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ మనదేశం లో ప్రబలకుండా అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకొంటున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమ వారం ప్రకటించింది. అందులో భా గంగా ప్రతి దవాఖానలో చేరిన రో గుల్లో చర్మంపై గీతలు, దుద్దుర్లు కనిపిస్తే వారిని వెంటనే ఐసోలేషన్ సెం టర్లలో ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. ఈ విపత్తును ఎదుర్కొనేం దుకు ఢిల్లీలో నోడల్ దవాఖానలుగా సఫ్దర్‌జంగ్ దవాఖాన, లేడీ హర్డింజ్ మెడికల్ కాలేజీ, రామ్‌మనోహర్ లోహియా దవాఖానలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు.






