కమలా హారిస్ ముందంజ
20-08-2024 03:18 AM
వాషింగ్టన్, ఆగస్టు 19: ఊహించని విధంగా అమెరికా అధ్యక్ష రేసులోకి దూసుకొచ్చిన ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొ నాల్డ్ ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ఆ యన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజాభిమానంలో కమలను అధిగమించలేకపోతున్నారు. తాజాగా విడుదలైన వాషింగ్టన్ పోస్ట్ న్యూస్ సర్వేలోనూ కమలదే పైచేయి అని తేలింది. ట్రంప్‌కంటే కమల నాలుగు పాయింట్లు ముందంజలో ఉన్నారు. ఈ తేడా చాలా స్వల్పమే అయినా అసలు పోటీలోనే నిలువలేదని భావించిన కమల.. ప్రత్యర్థికంటే ముందు ఉండటం గొప్ప విషయమేనని ఆ దేశ ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. తాజా సర్వేలో కమలకు 49 పాయింట్లు రాగా, ట్రంప్‌కు 45 పాయింట్లు వచ్చాయి.






