19 April, 2026 | 4:05 AM

క్యాబ్‌లో ప్రయాణించిన రాహుల్‌గాంధీ

20-08-2024 03:16 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సోవారం సాధారణ వ్యక్తిలా ఓ క్యాబ్‌లో ప్రయాణించారు. క్యాబ్‌లో ప్రయాణిస్తూ డ్రైవర్‌తో ముచ్చటిస్తున్న వీడియోను ఆయనర ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. గిగ్ వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. రాహుల్ గాంధీకి డ్రైవర్ సునీల్ ఉపాధ్యాయ్ తన సమస్యలు మొరపెట్టుకొన్నాడు. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘తక్కువ ఆదాయాలు, ద్రవ్యోల్బణం జీవితాలను దుర్బరం చేస్తున్నది. ఇదే దేశంలోని గిగ్ వర్కర్ల బతుకు. ఉబర్ క్యాబ్‌లో ప్రయాణించి, డ్రైవర్, అతడి కుటుంబంతో చర్చించిన తర్వాత దేశంలోని క్యాబ్ డ్రైవర్లు, డెలివరి వర్కర్ల జీవితాలు ఎంత దుర్బరంగా ఉన్నాయో స్పష్టమైంది’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.