17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

02-06-2025 12:28 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 1 (విజయక్రాంతి): జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలపై  అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయా శాఖల వారీగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖల సమన్వయంతో పనిచే యాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని ఉద యం 9.45 నిమిషములకు గంటలకు ప్రగతి మైదానంలో అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాక ఆవిష్కరణ పోలీసుల గౌరవ వందనం ఉంటుందని తెలిపారు.

తెలంగాణ సాం స్కృతి సాంప్రదాయాలు ప్రతిభబింభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అన్నా రు. అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరావు జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో అమలు చేసిన, చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై శకటాలను ప్రదర్శించబడతాయి అన్నారు.

అన్ని శాఖలు ఆ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఐదు నియోజకవర్గాలలో తెలంగాణ సాంప్రదయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధిపై సందేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లే కుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.