27 July, 2026 | 7:51 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

పిల్లలందరినీ బడికి పంపించాలి

03-06-2026 01:43 PM

సర్పంచ్ బెండరే కృష్ణాజి

వాంకిడి, (విజయక్రాంతి) : పిల్లలందరినీ బడికి పంపించాలని బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి అన్నారు. బుధవారం బడిబాట కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ జాడే సంతోష్, ప్రధానోపాధ్యాయురాలతో కలిసి  ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల తో కలిసి గ్రామంలో అవ గాహన ర్యాలీ చేపట్టారు. పాఠశాల వయసున్న ప్రతి ఒక్కరినీ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను అందిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.