అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్, జూన్ 18: నియోజకవర్గం లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చొర వ తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి వార్డులో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని సూ చించారు. సమీక్షలో తిరుమలగిరి, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్ తహసీల్దార్లు అశోక్‌కుమార్, పద్మ సుందరి, పాండు నాయక్‌తో పాటు డీటీ పృథ్వీ, ఆర్‌ఐ మల్లేశ్ పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు రావొద్దు..
నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జింఖా నా విద్యుత్ శాఖ ఏఈ అర్చితారెడ్డికి ఎమ్మె ల్యే శ్రీగణేశ్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఏఈ మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై చర్చించారు. అలాగే క్యాంపు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే.. నియో జక వర్గంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని సూచించారు. సమీక్షలో బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, బేగంపేట, కార్ఖా నా, తిరుమలగిరి, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్లు రామయ్య, రామకృష్ణ, విజయ్‌కుమార్, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






