జాబ్‌మేళాను వినియోగించుకోవాలి
19-06-2024 12:31 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, జూన్ 18: హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో ఈ నెల 24న రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించి మంత్రి మాట్లాడుతూ.. 5 వేల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.






