ఆఫ్ఘన్‌ను అల్లాడిస్తారా?
* ఐపీఎల్ సందడి ముగిసిపోయి వారం రోజులవుతోంది. భారత్ ఆటగాళ్లు అంతర్జాతీయ సిరీస్‌లకు రెడీ అయ్యారు. ఇక్కడ నుంచి దాదాపు ఏడాది పాటు నాన్‌స్టాప్ క్రికెట్ ఆడబోతున్నారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడబోతున్నారు. రెడ్ బాల్ క్రికెట్‌లో గత ఏడాది పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌పై భారీ విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆప్ఘనిస్థాన్ ఎంతవరకూ పోటీ ఇస్తుందనేది చూడాలి
- భారీ విజయమే లక్ష్యంగా భారత్
- తుది జట్టు కూర్పుపై ఆసక్తి
- హర్షదూబే అరంగేట్రం ఖాయం
- ఆప్ఘనిస్థాన్ కనీస పోటీ ఇస్తుందా ?
ముల్లాన్ పూర్, జూన్ 5: భారత్, ఆప్ఘనిస్థాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచే ఆరంభం కాబోతోం ది. వరల్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఈ మ్యాచ్ భాగం కాదు. అఫ్గానిస్థాన్ డ బ్ల్యూటీసీలో భాగస్వామి కాకపోవడమే దీనికి కారణం. ఈ మ్యాచ్లో భారత్ గెలిచినా, ఓడినా డబ్ల్యూటీసీ పాయిం ట్లు మారవు. అయితే రెడ్ బాల్ క్రికెట్లో టీమ్‌ఇండియా తిరిగి పుం జుకోవడానికి, జట్టు కూర్పును మె రుగుపరచుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం. సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్‌లో రాణించిన పలువురు ఆటగాళ్లకు ఈ టెస్టులో చోటు దక్కింది. సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, పడిక్కల్ మళ్ళీ టెస్ట్ జట్టులోకి వచ్చారు. అలాగే తొలిసారి హర్షదూబే, గు ర్నూర్ బ్రార్ చోటు దక్కించుకున్నారు. పంత్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి రాహుల్‌ను గిల్‌కు డిప్యూటీగా నియమించారు. తుది జట్టును చూస్తే జైస్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. మూడో స్థానంలో సాయి సుదర్శన్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత గిల్, పంత్ బ్యాటింగ్‌కు రానున్నారు.
నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్ రౌండర్‌గా ఆడనుండగా.. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుం దర్, హర్ష్ దూబే స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. పేసర్లుగా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఆడనున్నారు. గత రెండు నెలలుగా టీ20 ఫార్మాట్‌కు అలవాటు పడిన భారత క్రికెటర్లు రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఎలా రాణిస్తారనేది చూడాలి. ఇంతకు ముందు అఫ్గా నిస్థాన్ తొలిసారిగా 2018లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్తో తలపడింది.
ఈ మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచి ఇన్నింగ్స్, 262 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్- కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా సతమతమవుతోంది. రెడ్ బాల్ క్రికెట్‌లో తిరిగి సత్తా చాటాలని చూస్తు న్న భారత్ ఆప్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఉపఖండపు పిచ్‌లపై బాగా అలవాటు పడిన ఆప్ఘన్ క్రికెటర్లు భార త్‌కు గట్టిపోటీనివ్వాలని పట్టుదలగా ఉన్నారు.
అస్మతుల్లా షాహిది సారథ్యంలోని ఆప్ఘనిస్థాన్ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రా ణిస్తున్న క్రికెటర్లనే ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. వారం తా భారత బౌలింగ్‌ను తట్టుకుని ఏ మేర నిలబడతారో వేచిచూడాలి. ముల్లాన్ పూర్ పిచ్ మొదటి రెండు రోజులు బ్యా టర్లకు, క్రమంగా స్పిన్‌కు అనుకూలించే అవకాశముంది.
తుది జట్ల అంచనా
భారత్ : కెఎల్ రాహుల్, జైస్వాల్, సాయి సుదర్శన్, గిల్ (కెప్టెన్), పంత్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష దూబే, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఆప్ఘనిస్థాన్ : అబ్దుల్ మాలిక్, అతల్, గుర్బాజ్, హస్మతుల్లా షాహిది(కెప్టెన్), జజా య్, రహమత్ షా, ఒమర్జాయ్, అష్రాఫ్, నాంజేలియా, రహమాన్






