ఉత్తరాఖండ్‌లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ సమావేశం
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కు ఆహ్వానం..
ఈనెల 3, 4 తేదీలలో జరగనున్న సమావేశాలు..
ముకరంపుర, జూన్01(విజయక్రాంతి): ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117 వ సమావేశాల్లో గౌరవ అతిథిగా పాల్గొనాల్సిందిగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కు ఋషికేష్ నగరపాలక సంస్థ ఆహ్వానం పలికింది. ఈ మేరకు సోమవారం రోజున ఋషికేష్ నగరపాలక సంస్థ నుండి మేయర్ కోలగాని శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రికను పంపించారు.
జూన్ 3, 4 తేదీల్లో ఋషికేశ్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ అధ్యక్షురాలు రేణు బాల గుప్తా అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి పుష్కర్ సింగ్ ధామి తో పాటు పలువురు క్యాబినెట్ మంత్రులు, రాజ్యసభ, లోక్ సభ సభ్యులు హాజరుకాన్నారు.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ కార్యదర్శి, ఆహ్వాన కర్త మనోజ్ గుప్తా, సహా ఆహ్వాన కర్త , ఋషి కేష్ నగరపాలక సంస్థ మేయర్ రణజాయ్ పాన్వర్ ల ఆహ్వానం మేరకు మేయర్ కోలగాని శ్రీనివాస్ సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగాఈ సమావేశాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల మేయర్లు పాల్గొని పట్టణాభివృద్ధి, నగర పాలన, ప్రజా సేవల మెరుగుదల, స్మార్ట్ సిటీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.






