27 May, 2026 | 2:05 AM

యూకే టూర్‌కు ఆల్‌రౌండర్ నిపుణ్‌రెడ్డి

27-05-2026 12:23 AM

హైదరాబాద్, మే 26: హైదరాబాద్ నుంచి మరో యువ ఆల్‌రౌండర్ దూసుకొస్తున్నాడు. గత కొన్ని నెలలుగా అండర్ 19 క్రికెట్‌లో రాణిస్తున్న బౌలింగ్ ఆల్ రౌండర్ షవ్వా నిపు ణ్‌రెడ్డి ఇప్పుడు వెంగ్‌సర్కార్ అకాడమీ యూకే టూర్‌కు ఎంపికయ్యాడు. హైదరాబాద్ నుంచి ఎంపికైన నలుగురిలో 16 ఏళ్ల నిపుణ్‌రెడ్డి ఒకడు. హైదరాబాద్ జట్టు  వినూ మన్కడ్ ట్రోఫీ  గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

తర్వాత హెచ్‌సీఏ బి డివిజన్ టూ డే లీగ్‌లో జై భగవతి క్రికెట్ క్లబ్ తరపున బరిలోకి దిగి ఆకట్టుకున్నాడు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. తొలి మ్యాచ్ లో 72 నాటౌట్, 5 వికెట్లు తీసాడు. తర్వాత రెండో మ్యాచ్‌లో 42 నాటౌట్, 1 వికెట్, మూడో మ్యాచ్‌లో 29 పరుగులు చేసాడు. నాలుగో మ్యాచ్‌లో 30 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఐదో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన నిపుణ్‌రెడ్డి 1 వికెట్ పడగొట్టాడు.

ఆరో మ్యాచ్‌లో 37 రన్స్, 3 వికె ట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం 88.25 సగటుతో 266 పరుగులు చేసిన నిపుణ్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టగా.. అందులో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. అం డర్ 19 విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 2017లో క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన నిపుణ్‌రెడ్డి రామానాయుడు క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతు న్నాడు.

అండర్19 ప్రపంచకప్ ఆడడమే లక్ష్యం గా ప్రస్తుతం సాధన చేస్తున్నాడు. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే తన టార్గెట్‌గా నిపుణ్‌రెడ్డి చెబుతున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ల ట్రైనింగ్ వల్లనే తాను నిలకడగా రాణిస్తున్నట్టు నిపుణ్ చెబుతున్నాడు. యూకే టూర్‌కు ఎంపికవడంపై సంతోషంగా ఉందన్న నిపుణ్ రెడ్డి తన ఆటతీరును మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని చెప్పాడు.