17 May, 2026 | 7:20 PM

అక్రమాలకు పాల్పడుతున్న వారికి చైర్మన్ పదవుల

17-05-2026 06:12 PM

బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆరోపణ 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రైతులను నట్టేట ముంచుతూ అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు సింగిల్ విండో చైర్మన్ పదవులు ఇవ్వడం సిగ్గుచేటని బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సుర శ్యామ్, తిప్పారపు దయాకర్, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, ఆనుమాల బాపూరావు లు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీల అమలు 420 హామీలను తుంగలో తొక్కి పాలన కొనసాగిస్తున్నారని,  గ్యారంటీల అమలు మరిచిపోయారని అన్నారు.

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఏ సమస్య లేదని అన్ని అనుకూలంగా ఉన్నాయని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులను నట్టేట ముంచుతున్నారని యూరియాకు సైతం చెప్పులు లైన్ లో పెట్టి క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. సుల్తానాబాద్ సహకార సంఘంలో అనేక అక్రమాలు జరుగుతున్న పట్టించుకునే నాధుడే లేడని 2020లో జరిగిన అక్రమాల గురించి చెప్పారు. 12 సంవత్సరాలు చైర్మన్ గా ఉండి  కేవలం కమిషన్ల కోసమే  శ్రీగిరి శ్రీనివాస్ పని చేశాడు తప్ప రైతులకు చేసింది శూన్యమని తెలిపారు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో నిర్మాణం చేపట్టిన మూల మలుపు వద్ద షెటర్లు తొలగిస్తామని కోర్టు ముందు చౌరస్తా చేస్తామని అన్న నాయకులు ప్రస్తుతం అది మర్చిపోయారని వారన్నారు, యువతను పట్టించుకోవాలని వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.