17 July, 2026 | 12:01 PM

హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు

17-07-2026 12:01 PM
  1. తూర్పుగూడెంలో కొణతం భాగ్యమ్మ హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.
  2. ఆస్తి కోసం అత్తను హత్యచేసిన.. కోడలు.
  3. సహజ మరణంగా చిత్రీకరించారు, కేసు ఛేదించిన తుంగతుర్తి పోలీసులు.

తుంగతుర్తి (విజయక్రాంతి):సూర్యాపేట పట్టణంలో డిఎస్పీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితురాలి అరెస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్. తేదీ: 28.04.2026 రోజున తూర్పుగూడెం గ్రామంలో మృతి చెందిన కొణతం భాగ్యమ్మ మృతి పై అమే కూతురు ఉప్పు శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగతుర్తి పోలీస్ వారు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా మృతురాలి యొక్క కోడలు అయిన కొణతం మధుర హత్య చేసినట్లు గుర్తించి నీ దుతురాలుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగినది అని సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపినారు.

  బాగ్యమ్మకు సుమారు 6 ఎకరాల భూమి తూర్పుగూడెం గ్రామంలో ఉన్నది. అట్టి భూమి లో పిర్యాదురాలు అనగా మృతురాలు కూతురు శోభ  తనకు  భాగం కావాలని తుంగతుర్తి కోర్ట్ లో కేసు ఫైల్ చేయడం జరిగినది. అప్పటినుండి వారి మద్య గొడవలు జరుగుతున్నాయి l. ఆ క్రమములో తేదీ 26-04-2026 రోజున నిందుతురాలు ఇంటిలో లేని సమయములో పిర్యాదురాలు తల్లిని కలిసి భూమి వాటా విషయం అడిగి వెళ్ళినది. నిందుతురాలు ఆదేరోజు రాత్రి ఇంటికి వచ్చినది, తేధి: 27-04-2026 రాత్రి రోజు మాదిరిగా నిందుతురాలు కల్లు త్రాగిన తరువాత 09:00 గంటల సమయములో మృతురాలు మరియు నిందుతురాలు ఇంట్లో ఉండగా, పిర్యాది వచ్చిన విషయం చెప్పుతూ, శోభ భూమి అడుగుతున్నది. 

కనీసం 2 ఎకరలన్న ఇవ్వమని నిందుతురాలు కి చెప్పగా, భూమిని  దక్కించుకొనే విషయమై చంపాలన్న ఉద్దేశ్యంతో నిందుతురాలు, మృతురాలిని గట్టిగా నేలపై నెట్టివేయగా కింద పడిపోయింది. మరలా ఆమె మళ్లీ లేచి నిలబడగా, నిందుతురాలు మరోసారి ఆమెను వెనుకనుండి చేతులతో మెలివేసి మంచం మీదకు నెట్టినది. కొద్దిసేపటి తరువాత ఆమె అక్కడే మరణించింది. ఇట్టి విషయాన్ని నిందుతురాలు, మృతురాలు తనంతట తానే, మంచo మీద నుండి కిందబడి చనిపోయింది అని, వారి బందువులకు ఫోన్ చేసి చెప్పి నమ్మించినది. మృతురాలి అంత్యక్రియల సమయo లో స్నానం చేయిస్తుండగా, పిర్యాదురాలు, వారి  బందువులు మృతురాలు వంటి పై గాయాలు గమనించి, పిర్యాధు చేయగా, కేసు నమోదు చేసుకొని, విచారణ చేయగా పై విషయం తెలిసినది. 

 కొణతం భాగ్యమ్మ హత్యకు సంభందించి నిందితురాలిని కొనతం మధుర ను, తేధి : 15-07-2026 రోజున అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సూర్యాపేట డి.ఎస్.పి ప్రసన్నకుమార్  తుంగతుర్తి సర్కిల్ సీఐ బి. ఉపేందర్ రావు, లు పేర్కొన్నారు. జరిగిన హత్యా సంఘటన చేదించిన పోలీస్ శాఖ అధికారులకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కృతజ్ఞతలు తెలిపారు.