11 May, 2026 | 10:49 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఆరని విప్లవజ్యోతి అల్లూరి

07-05-2024 12:10 AM

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్య్ర సమరంలో మహావీరులు ఎందరో ఉన్నారు. వారిలో మన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఒకానొక మహా యుగపురుషుడు అల్లూ రి సీతారామరాజు. ఆంధ్రుల ధైర్య సాహసాలను, తెలివితేటలను భారతజాతికి తెలియజేసిన ఆ వీర కిశోరం తరతరాలకు  ధ్రువతారగా నిలిచిపోయాడు. మన్యం ప్రజల శ్రేయస్సుకై అహర్నిశలు శ్రమించి వారి పాలిట  దైవంగా కొనియాడబడ్డా డు. అనేక ఉద్యమాలు నిర్వహించి తెల్లదొరలపై తిరుగుబాటు చేశాడు. పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేసి వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన విప్లవజ్యోతి అల్లూరి. కేవలం 27 సంవత్సరాలకే తన ప్రాణాన్ని అర్పించారు. 

అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న అప్పటి విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగి అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి వెంకట రామరాజు చక్కని ఫొటోగ్రాఫర్, చిత్రకారుడు. ఫొటోగ్రఫీతో జీవ నం గడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి సూర్యనారాయణమ్మ మహా పతివ్రత. ఆమెకు భారత, భాగవత, రామాయణాలు కంఠతా వచ్చు. తీరిక వేళల్లో ఆధ్యాత్మిక, రామాయణ కీర్తనలు పాడుతూ రామరాజుకి  సాధు శీలత, ధర్మ నిరతి వంటి సద్గుణాలను అలవరించింది. 1908లో కలరా వ్యాధి సోకి  తండ్రి మరణించడంతో రామరాజు మానసికంగా ఎంతో దెబ్బ తిన్నాడు. కొందరు బంధువుల ప్రోత్సాహంతో కోలుకొని తిరిగి చదువులో పడ్డాడు. 

18వ ఏట తీర్థయాత్రలు

కాకినాడలో 8వ తరగతి చదువుతున్నప్పుడు స్త్రీ పాత్రలను రక్తి కట్టించాడు. గొప్ప నటుడు అని చిన్నతనంలోనే పేరు పొందాడు. పాఠశాలలో విద్యార్థులకు నాయకుడిగా ఉంటూ వారికి వ్యాయామ విద్యలో ఆసక్తి కలిగించాడు. ఒకసారి కాకినాడలోని రామకృష్ణ గారి కార్యాలయం లో రామరాజు ఇంద్రజాల ప్రదర్శన చేసినప్పుడు ముగ్ధులైన కొంతమంది ప్రేక్షకు లు అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తిగా అతణ్ణి భావించారు. కానీ, నిజాయితీగా తన వద్ద మంత్ర తంత్ర అతీంద్రియ శక్తులు ఏమీ లేవని చెప్పాడు. 18వ ఏట దేశంలోని పరిస్థితులను తెలుసుకోవాలనే తపనతో తీర్థయాత్రలు చేద్దామనే కోరికతో హరిద్వార్ వెళ్ళాడు. అక్కడి నుండి అడవిమార్గాన నడక సాగిస్తూ రిషీకేశ్, బద్రీనాథ్, కాశీ, ప్రయాగ, పూరి, బొంబాయి, కాశ్మీర్‌లు తిరిగి అపారమైన జ్ఞానం సంపాదించి ఇంటికి వచ్చి భవిష్యత్తు కార్యక్రమంపై ఆలోచించ సాగాడు. 

చింతపల్లి పిఎస్‌పై దాడి

ఇక, విప్లవం కొనసాగించడమే తరువాయి అనుకొనే సమయంలో విశాఖప ట్నం జిల్లాలోని కృష్ణదేవిపేట, జోగంపేట, మల్లం పేట, శరభన్నపాలెం, చిట్టెం పాడు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తూ కూలి ఇవ్వకుండా దోపిడీ చేయడం గురించి విన్నాడు. ఆ గ్రామాలకు వెళ్లి ‘మీకు కూలీ ఇవ్వనిదే వెట్టిచాకిరి చేయకండి’ అని బోధించాడు. అందరికీ తగు శిక్షణ ఇచ్చి 1922 ఆగస్టు లో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తమ ఉనికిని ప్రభుత్వానికి తెలిపాడు. దాని గురించి విన్న మద్రాసు ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ‘రామరాజు చర్యలను అరి కట్టకపోతే ప్రమాదం ముంచుకు వస్తుందని’ గ్రహించి తమ అధికారులను అప్రమత్తం చేసింది. 

అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసి నా, మరెన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తూ వారి అంచనాలను తలకిందులు చేస్తూ మిరపకాయ టపాద్వారా తను చేయబోయే దాడుల గురించి ముందు గా సమాచారం తెలియజేసేవాడు. ధైర్యంగా అవి పూర్తి చేసి వారికి కంటికి నిద్ర లేకుండా చేశాడు. కుటిల యత్నం తో రామరాజు ఆచూకీ చెప్పాలని మన్యం ప్రజలను హింసించడం ప్రారంభించారు. అనేక మందిని పిట్టలను కాల్చి నట్టు కాల్చి చంపారు. అది తెలుసుకొని భరించలేక రామరాజు తనకు తానే 1924 మే 7న పట్టుబడినాడు. మేజర్ గుడాల్ అనే అధికారి రామరాజును చెట్టుకు కట్టి దారుణంగా కాల్చి చంపాడు. ప్రతి ఒక్కరూ విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకోవాలి. వీరి జీవిత చరిత్రని అధ్యయనం చేయాలి. నేటి తరం విద్యార్థులకు,యువతకి రామరాజు జీవిత చరిత్ర ఎంతగానో ఉపయోగకరం. ఇదే ఆ మహాపురుషునికి మనమిచ్చే నివాళి.

 కామిడి సతీష్‌రెడ్డి

సెల్: 9848445134